రష్యా నుంచి తక్షణమే వచ్చేయండి

Americans told to leave Russia immediately - Sakshi

తమ పౌరులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక

వాషింగ్టన్‌: రష్యాలో ఉంటున్న, అక్కడికి ప్రయాణం చేస్తున్న తమ పౌరులు తక్షణమే వెనక్కి వచ్చేయాలని అమెరికా కోరింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యా అకారణంగా అమెరికా పౌరులను అరెస్ట్‌ చేసి వేధించే ప్రమాదముందని హెచ్చరించింది. ‘రష్యా భద్రతా సంస్థలు అమెరికా పౌరులపై నిరాధార ఆరోపణలు చేసి, నిర్బంధంలో ఉంచుతున్నాయి. వారికి న్యాయసాయం, అవసరమైన వైద్య చికిత్సలను సైతం అందకుండా చేస్తున్నాయి.

రహస్య విచారణలు జరుపుతూ, ఎటువంటి రుజువులు లేకుండా దోషులుగా ప్రకటిస్తున్నాయి. మత ప్రచారకులైన అమెరికా పౌరులపై సైతం గూఢచర్యం కేసులను మోపి, విచారణల పేరుతో వేధిస్తున్నాయి’అని అందులో పేర్కొంది. సైన్యంలోకి రిక్రూట్‌మెంట్లను ప్రారంభించాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తర్వుల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికా తమ పౌరులకు ఇదే విధమైన హెచ్చరికలు చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top