విష ప్రయోగం నుంచి కోలుకుని...

బెర్లిన్: విష ప్రయోగానికి గురైయిన రష్యా విపక్ష నేత అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు అలెక్సీ నావల్నీ కోలుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం జర్మనీలోని బెర్లిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫోటోని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆగస్ట్ 20న సైబీరియా నుంచి బెర్లిన్ వస్తుండగా నావల్నీ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయనను మార్గంమధ్యలో జర్మనీలో విమానాన్ని అత్యవసరంగా దింపి ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ సాయం లేకుండా నావల్నీ శ్వాస తీసుకుంటున్నారు.
కాగా నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. సైబీరియాలోని టోమ్‌స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్‌స్క్ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసి ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా నావల్నీపై అనుమానిత విషప్రయోగం జరగ్గా ఆసుపత్రి పాలయ్యారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి