వీడియో వైరల్‌.. ఇజ్రాయిల్‌పై హౌతీ క్షిపణి దాడి.. ఎయిర్‌పోర్టులో భారీ బిలం | 25 Meter Deep Crater At Israel Biggest Airport After Houthi Missile Strike | Sakshi
Sakshi News home page

వీడియో వైరల్‌.. ఇజ్రాయిల్‌పై హౌతీ క్షిపణి దాడి.. ఎయిర్‌పోర్టులో భారీ బిలం

May 4 2025 6:30 PM | Updated on May 4 2025 6:44 PM

25 Meter Deep Crater At Israel Biggest Airport After Houthi Missile Strike

హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సైల్‌తో విరుచుకుపడ్డారు. ఆదివారం. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పైకి క్షిపణితో ఎటాక్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్‌ ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది.  మిస్సైల్‌ ధాటికి 25 మీటర్ల లోతైన భారీ గొయ్యి ఏర్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇజ్రాయిల్‌కి ఉన్న శక్తివంతమైన నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని  క్షిపణి దాడి జరగడం సంచలనం కలిగిస్తోంది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు వెల్లడించారు.

ఇజ్రాయెల్‌పై హౌతీ ఎటాక్‌తో భారత్‌ అలర్ట్‌..
మరోవైపు, ఇజ్రాయెల్‌పై హౌతీ ఎటాక్‌తో భారత్‌ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్‌ అవీన్‌కు  ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది. టెల్‌ అవీవ్‌కు వెళ్లే విమాన సర్వీసులను అబుదాబికి మళ్లించింది. రెండు రోజల పాటు టెల్‌ అవీవ్‌కు సర్వీసులను రద్దు చేసింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement