అంబర్‌పేట: నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ నెల 31న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (గ్రీన్‌ల్యాండ్స్) సంయుక్తాధ్వర్యంలో జాబ్ మేళాను చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధులు హరిసందీప్, మువ్వ రాంరెడ్డి, లక్ష్మీకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, బీటెక్, ఎంబీఏ అర్హతగల నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 18– 30 సంవత్సరాల వయసువారు అర్హులన్నారు. ప్రత్యేకించి ఈ జాబ్‌మేళాలో ప్రైవేటు ఉపాధ్యాయుల ఎంపిక ఉంటుందని, అర్హతను బట్టి వేతనం రూ.17 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు రాణీగంజ్ గుజరాతీ హైస్కూల్‌లో శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే జాబ్‌మేళాకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వెబ్‌సైట్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో సంప్రదించాలన్నారు. 95424 33427కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.