గ్రీవెన్స్‌పై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌పై నిర్లక్ష్యం వద్దు

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

గ్రీవెన్స్‌పై నిర్లక్ష్యం వద్దు 10 నుంచి డిగ్రీ పరీక్షలు

మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్‌ పరీక్షలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి ముందుగానే కళాశాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల టైంటేబుల్‌ షెడ్యూల్‌ను కూడా విద్యార్థులు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

అర్జీలు బాధ్యతాయుతంగా పరిష్కరించాలి

బల్దియా అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌

వరంగల్‌ అర్బన్‌: ప్రజలు అనేక వ్యయప్రయాసలకోర్చి గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు వచ్చి ఫిర్యాదులు ఇస్తారని, ఆ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత బల్దియా అధికారులు, సిబ్బందిదే అని అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్‌ నిర్వహించారు. ప్రజల నుంచి అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆయా ఫిర్యాదులపై అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. మొత్తం 86 ఫిర్యాదులు రాగా.. టౌన్‌ ప్లానింగ్‌కు 28, ఇంజనీరింగ్‌ 20, రెవెన్యూకు 14, హెల్త్‌ – శానిటేషన్‌ 14, నీటి సరఫరాకు 10 ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ సిటీప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, వెటర్నరీ వైద్యుడు డాక్టర్‌ గోపాల్‌రావు, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య (అడ్మిన్‌), పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

హనుమకొండ ఎన్జీఓస్‌ కాలనీలో డ్రెయినేజీ బ్లాక్‌ అవుతుందని రెండుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రజారోగ్యం సిబ్బంది పట్టించుకోవట్లేదని ధర్మయ్య ఫిర్యాదు చేశారు.

నల్లా కనెక్షన్‌ లేకున్నా బిల్లు రూ.7,200 వేశారని, చర్యలు తీసుకోవాలని హనుమకొండ లష్కర్‌ బజార్‌కు చెందిన విజయలక్ష్మి విన్నవించారు.

60వ డివిజన్‌ వడ్డేపల్లి ముదిరాజ్‌వాడలో నల్లా నీరు రావట్లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.

భీమారంలోని కమ్యూనిటీ హాల్‌కు నల్లా కనెక్షన్‌, వాటర్‌ ట్యాంక్‌ మంజూరు చేయాలని స్థానికులు కోరారు.

హసన్‌పర్తి కాకతీయ వంటేజీ బ్లాక్‌ జీలో సౌకర్యాలు కల్పించాలని అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

వరంగల్‌ రామన్నపేట 29వ డివిజన్‌లో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు విన్నవించారు.

38 డివిజన్‌లో మూడేళ్లుగా డ్రెయినేజీ సమస్య ఉందని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.

3వ డివిజన్‌ పైడిపల్లి 47–1–214 ఇంటి నంబర్‌కు నల్లా కనెక్షన్‌ లేదని, బిల్లు వస్తోందని అంగం రాజేశ్వర్‌ రావు ఫిర్యాదు చేశారు.

పైడిపల్లి 47–5–492/ఏ1 సీసీ రోడ్డు మంజూరు చేయాలని పలుమార్లు విన్నవించినా ఇంజనీర్లు పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు.

దేశాయిపేట 12వ డివిజన్‌లోని 22–1–144 వద్ద భారీ వాహనాల వల్ల కల్వర్టు కుంగిపోతోందని కొత్తగా నిర్మించాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

వరంగల్‌ కృష్ణా కాలనీలో బాలిక కళాశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని టీచర్లు వినతి పత్రం అందించారు.

39వ డివిజన్‌లో వీధికుక్కల బెడద విపరీతంగా ఉందని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

13–1–224 ప్రాంతంలో ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, పొదలతో దోమల బెడద విపరీతంగా ఉందని చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

44వ డివిజన్‌ బెస్తం చెరువుకు సమీపంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని స్థానికులు కోరారు.

60వ డివిజన్‌ వడ్డేపల్లి ముదిరాజ్‌ వాడలో నల్లా నీరు రావట్లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement