● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: నగరంలో ఆస్తి పన్ను వసూళ్లను మరింత పెంచేందుకు ‘ఎర్లీ బర్డ్’ పద్ధతిలో అందిస్తున్న 5 శాతం రాయితీపై ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులకు సూచించారు. సోమవారం నగర ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మేయర్ మాట్లాడారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను వసూళ్లలో అధికారులు చూపుతున్న కృషిని అభినందిస్తూ, ఇదే ఉత్సాహంతో లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. నగరంలో సుమారు రూ.80 కోట్ల నల్లా పన్ను బకాయిలు ఉన్నాయని, వసూళ్లు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య (అడ్మిన్) పన్నుల అధికారి రామకృష్ణ, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.


