న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసారి వినూత్నంగా దరఖాస్తుదారుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు జూమ్ వీడియో కాల్ ద్వారా సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ సమన్వయం చేసి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మొత్తం 150 వినతులు రాగా, ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, ఆర్డీఓ సుమ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినతులు ఇలా..
● జిల్లా చేనేత పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేతన్నల ఉపాధిని దెబ్బతీసే ప్రైవేట్ టెండర్ విధానాన్ని ఆపాలని వరంగల్ చేనేత కార్మికులు విన్నవించారు.
● ఉర్సు ప్రసూతి ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చాలని కార్పొరేటర్ మరుపల్లి రవి విన్నవించారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ప్రజావాణికి 150 వినతులు


