అర్జీలు సత్వరమే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరమే పరిష్కరించండి

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

అర్జీలు సత్వరమే పరిష్కరించండి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 155 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని వినతి

నగరంలోని 65వ డివిజన్‌ పరిధి చింతగట్టు గ్రామానికి శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, విద్యారణ్యపురి–గోపాలపురం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ద్వారా హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి లేఖ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement