ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు మెరుగుపర్చాలి

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

హన్మకొండ అర్బన్‌: ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా ఆస్పత్రుల్లో అందుతున్న సేవలు, 102, 108 వాహనాల వినియోగం, బ్లడ్‌ బ్యాంక్‌ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సిజేరియన్‌ ప్రసవాలు తగ్గించి సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

భోజనంలో నాణ్యత పాటించాలి..

ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో తప్పక అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఫుడ్‌ ఇన్‌చార్జ్‌లు, వంట కార్మికులు, సహాయకులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.

స్వయం ఉపాధి సాధనకు శిక్షణ

మహిళలు స్వయం ఉపాధిని సాధించేందుకు శిక్షణ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో దామెర మండలం ల్యాదెళ్లలో మహిళలకు ఉపాధి కల్పించే శిక్షణ కార్యక్రమాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వి–హబ్‌ ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. పరకాల నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, చీర రోలింగ్‌ యూనిట్లకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసినట్లు వివరించారు.

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement