క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరువ | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరువ

Mar 27 2026 9:55 AM | Updated on Mar 27 2026 9:55 AM

హన్మకొండ కల్చరల్‌ : విద్యార్థులు ప్రణాళికాప్రకారం క్రమశిక్షణతో చదివితే లక్ష్యానికి చేరుకుంటారని, చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించేలా విషయ సేకరణ చేసి భద్ర పరచాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ వెలుదండ నిత్యానందరావు అన్నారు. గురువారం వరంగల్‌ హంటర్‌ రోడ్డులోని జానపద గిరిజన విజ్ఞాన పీఠాన్ని సందర్శించారు. అనంతరం జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి వీసీ నిత్యానందరావు, కేయూ విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ గతంలో పీఠంలో జరిగిన పరిశోధనలు, పొందుపరిచిన పరిశోధనాంశాలను డిజిటలైజేషన్‌ చేయాలని, అందుకు సహకరిస్తానన్నారు. అనంతరం ఆచార్య అయిలయ్య.. విద్యార్థులకు భాషా ప్రావీణ్యం, సాహిత్యంపై అవగాహన కల్పించారు. పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న మాట్లాడుతూ వీసీ నిత్యానందరావు విద్యార్థుల కోరిక మేరకు పీఠంలో తగిన సదుపాయాలు కల్పించారన్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌ అమేర్‌ అలీఖాన్‌, పీఠం అసిస్టెంట్‌ ప్రాఫెసర్లు శ్రీమంతుల దామోదర్‌, బాసాని సురేశ్‌, చూరేపల్లి రవికుమార్‌, అబ్బు గోపాల్‌రెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ గంపా సతీశ్‌, సిద్దోజు సునంద, గెస్ట్‌ లెక్చరర్‌ నోముల రాజు, సిబ్బంది ఆంజనేయులు, అశోక్‌ , సులోచన, కస్తూరి బాయి, పరిశోధకులు సోనబోయిన సతీశ్‌, శాంతి, తదితరులు పాల్గొన్నారు.

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు

విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు

వరంగల్‌ జానపద గిరిజన విజ్ఞాన పీఠం సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement