కాజీపేట: జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాజీపేట పీఎస్ ఆవరణలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 9 ద్విచక్ర వాహనాలతోపాటు నిందితుడిని అరెస్ట్ చూపించారు. ఏసీపీ కథనం ప్రకారం.. వేలేరు మండలం షోడశపల్లి గ్రామానికి చెందిన గొడుగు సంతోష్ (28) హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆటో నడపగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. అయితే డబ్బులు సరిపోకపోవడంతో బైక్ చోరీలకు పాల్పడుతున్నాడు. ఇలా కాజీపే ట రైల్వే పరిసర ప్రాంతాల్లో 9 బైక్‌లు ఎత్తుకెళ్లి విక్రయించాడు. ఈ డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కాజీపేటకు చోరీ చేసిన బైక్‌పై వచ్చాడు. ఆ సమయంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన సంతోష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌ల చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఓ రహస్య ప్రదేశంలో పార్క్ చేసిన 9 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సీఐ వై.సుధాకర్ రెడ్డి, ఎస్సైలు వి.నవీన్‌కుమార్, తాళ్లపల్లి యాదగిరి, లవన్‌కుమార్, శివ, తదితరులు పాల్గొన్నారు.
నిందితుడి అరెస్ట్, 9 వాహనాలు స్వాధీనం


