నర్సంపేట: శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని నర్సంపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ పసిడి పాదుకలను తయారుచేశారు. రాముడిపై ఉన్న తన భక్తిని చాటుతూ 8 మిల్లీమీటర్ల వెడల్పు, 7 మిల్లీమీటర్ల ఎత్తులో 40 మిల్లీగ్రాముల బంగారంతో సూక్ష్మ పాదుకలను తయారు చేశారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతోందని, అందుకే ప్రపంచ శాంతి నెలకొనాలని సీతారాములను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం ఎదుర్కొనే ఆటంకాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు.


