నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి

Mar 25 2026 7:52 AM | Updated on Mar 25 2026 7:52 AM

వరంగల్‌ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ

ఖిలా వరంగల్‌: పంటల సాగులో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని వరంగల్‌ జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయనిర్మల, శాస్త్రవేత్తలు శ్రావణ్‌, మధు, కేవీకే శాస్త్రవేత్త సౌమ్య సూచించారు. ఈమేరకు మంగళవారం వరంగల్‌ రైతుశిక్షణ కేంద్రంలో రైతులు–శాస్త్రవేత్తల చర్చా గోష్టి నిర్వహించారు. వరంగల్‌, ఖిలా వరంగల్‌, గీసుకొండ, సంగెం, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల రైతులు హాజరై పంటల సాగులో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు, సాంకేతిక సలహాలు పొందారు. ముఖ్యఅతిథిగా వారు హాజరై పంటలసాగు, విత్తనాల ఎంపిక, పురుగులు, తెగుళ్ల నియంత్రణ, సమగ్రపంటల సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా జీవనియంత్రణ పద్ధతులు, సమగ్ర పురుగు మందుల నిర్వహణ, మట్టి పరీక్షల ప్రాముఖ్యత, అధిక దిగుబడులు సాధించే ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై ప్రదర్శనలు, చర్చ నిర్వహించారు. వర్ధన్నపేట ఏడీఏ నర్సింగం, బయోకంట్రోల్‌ ల్యాబ్‌ ఏడీఏ మాధవి, వరంగల్‌ మండల వ్యవసాయాధికారి రవీందర్‌రెడ్డి, ఏఈఓ ఆశాదీప్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement