విద్యారంగానికి బడ్జెట్‌ 20 శాతానికి పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యారంగానికి బడ్జెట్‌ 20 శాతానికి పెంచాలి

Mar 25 2026 7:51 AM | Updated on Mar 25 2026 7:51 AM

విద్యారంగానికి బడ్జెట్‌ 20 శాతానికి పెంచాలి

టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి

హన్మకొండ అర్బన్‌/కాళోజీ సెంటర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీపీటీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ యూనియన్‌ హనుమకొండ, వరంగల్‌ జిల్లా శాఖల ఆద్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతులు, కంప్యూటర్లు, గ్రంథాలయాలు, ఉపాధ్యాయుల నియామకం, ప్రీ–ప్రైమరీ తరగతుల ప్రారంభం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. రెండు జిల్లాల అధ్యక్షులు బత్తిని శ్రీమాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్‌ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం టైమ్‌ స్కేలు వర్తింపజేయాలని, సమ్మె కాలపు జీతాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా కార్యక్రమాల్లో యూ నియన్‌ రెండు జిల్లాల బాధ్యులు గొడిశాల సత్యనారాయణ, ముత్యాల రఘుపతి, మనోజ్‌. సురేష్‌ బాబు, బెల్లంకొండ పూర్ణచందర్‌, మనుపాటి వెంటకటేశ్వర్లు, కడారి బోగేశ్వర్‌, బెల్లంకొండ రమేష్‌, కుమారస్వామి, సోమేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement