వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కమిషనర్ చంద్రశేఖర్, బల్దియాకు చెందిన విభాగాల అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్‌కు 35, ఇంజనీరింగ్‌కు 17, రెవెన్యూ 14, హెల్త్ – శానిటేషన్ 5, నీటి సరఫరా 5 దరఖాస్తుల అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ప్లానర్ రవీందర్ రాడేకర్ అకౌంట్స్ అధికారి శివలింగం వెటర్నరీ వైద్యుడు గోపాల్‌రావు, డీఈ సంతోశ్‌కుమార్ శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


