వరంగల్: హైదరాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా ఎరబ్రెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తూర్పు నుంచి పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు సుమారు 20 బస్సులు, 50 కార్లలో సుమారు 1,500 మంది కార్యకర్తలు తరలివెళ్తున్న వాహన శ్రేణికి డీసీసీ అధ్యక్షుడు ఎండీ.అయూబ్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, బస్వరాజు శిరీష శ్రీమాన్, బస్వరాజు కుమారస్వామి, పీసీసీ సభ్యుడు నల్లగొండ రమేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేశ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళీధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోరంట్ల రాజు, తత్తరి లక్ష్మణ్, జన్ను రవి, దూపం సంపత్, కరాటే ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.


