ఎంపీ వేం నరేందర్‌ను కలిసిన డీవైఎస్‌ఓ అశోక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంపీ వేం నరేందర్‌ను కలిసిన డీవైఎస్‌ఓ అశోక్‌

Mar 16 2026 8:38 AM | Updated on Mar 16 2026 8:38 AM

ఎంపీ వేం నరేందర్‌ను కలిసిన డీవైఎస్‌ఓ అశోక్‌ నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ ఏఓ కొత్త శ్రీప్రియకు ఇన్‌స్పైర్‌ అవార్డు ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ జీపీ కార్యదర్శులు బదిలీ

వరంగల్‌ స్పోర్ట్స్‌: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై న వేం నరేందర్‌రెడ్డిని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్‌ అశోక్‌కుమార్‌ ఆదివారం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రీడా పథకాలను ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అమలయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో అగ్రికల్చర్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. విద్య, సామాజిక, మహిళా సాధికారత, నాయకత్వ ప్రతిభ, వ్యవసాయ రంగాల్లో విశేషంగా కృషిచేసిన శ్రీప్రియ.. వీహబ్‌, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అవార్డుకు ఎంపికై ంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అవార్డుల కార్యక్రమంలో వీహబ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ సజ్జ, సినీ యాక్టర్‌ తన్వి చేతుల మీదుగా శ్రీప్రియ అవార్డు అందుకున్నారు. ఉమ్మడి సుస్థిర వ్యవసాయం–అధిక పంటల దిగుబడి కోసం కృషి చేస్తున్నందుకు అవార్డు దక్కడం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ మిత్రమండలి సౌజన్యంతో సామాజికవేత్త రంగరాజు శ్యాంసుందర్‌ రావు రాసిన ‘అద్భుత ప్రపంచంలోకి మా ప్రయాణం’ పుస్తకావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు హనుమకొండ పోస్టల్‌కాలనీలో అభయాంజనేయస్వామి దేవాలయ ఆవరణలో కవి వీఆర్‌ విద్యార్థి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ అంపశయ్య నవీన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సాహితీవేత్తలు గన్నమరాజు గిరిజమనోహరబాబు, నాగిళ్ల రామశాస్త్రి, మల్యాల మనోహర్‌రావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, వేముగంటి శుక్తిమతి, కాలనీ అధ్యక్షుడు చాడ జైహింద్‌రెడ్డి, స్థానికులు వాసిరెడ్డి కృష్ణారావు, మండవ రవీందర్‌రావు, దిలీప్‌కుమార్‌, ఏవీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌: పరిపాలనా సౌలభ్యంలో భాగంగా జిల్లాలోని 112 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తూ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించిన పంచాయతీ కార్యదర్శులు కొత్తగా వచ్చిన సర్పంచ్‌ల వల్ల కొంత ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో 317 పంచాయతీ కార్యదర్శులకు గాను 112 మందిని పరిపాలన సౌలభ్యం మేరకు బదిలీ చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement