హన్మకొండ: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్ల రవి అన్నారు. ఆదివారం హనుమకొండ అంబేడ్కర్ కూడలిలోని రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఇందులో కొండమల్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం కింద అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత, పరిమితి లేని వైద్యం అందించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు కూడా ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండానే ఆరోగ్య పథకం అమలు చేయాలని డి మాండ్ చేశారు. పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 40 శాతానికి తగ్గకుండా అమలు చేయాలని, ఎరియర్స్ వేతనంలో కలిపి ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్యా నరసింహ నాయక్, జనగామ, హనుమ కొండ అధ్యక్షులు మట్టపెల్లి వెంకటేశ్వర్లు, మరుపట్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మేకల రమేశ్, కల్చర ల్ సెక్రటరీ బోగం రాంచందర్, ఉద్యోగులున్నారు.
తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్


