వీకర్స్ కాలనీకి రోడ్డు వేయండి
వరంగల్: వరంగల్ ఓసిటీ ఇండోర్ స్టేడియం ఎదుట ఉన్న వీకర్స్ కాలనీకి వెంటనే సీసీ రోడ్డు వేయాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్ డాక్టర్ సత్యశారదను ఆదేశించినట్లు కాలనీ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం మంత్రి క్యాంపు ఆఫీస్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో కాలనీ వాసులు కలసి వినతి పత్రం అందించారు. తమ కాలనీలోకి వెళ్లే ప్రధాన రోడ్డును స్థానిక కార్పొరేటర్ 2010లో సొసైటీ సభ్యులతో కుమ్మకై ్క పాట్లుగా చేసి అమ్ముకున్నారని మంత్రికి వివరించారు. ఆ రహదారిని మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కలెక్టర్‌కు ఫోన్ చేసి రహదారిపై విచారణ జరిపించి అట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకుని కాలనీవాసుల కోసం రోడ్డు నిర్మించాలని ఆదేశించారు.
జంక్షన్‌ను అభివృద్ధి చేయాలి..
కాశిబుగ్గ అంబేడ్కర్ విగ్రహం చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలని, ఈ రహదారిని అంబేడ్కర్ మార్గ్‌గా వాడుకలోకి తీసుకురావాలని తెలంగాణ అంబేడ్కర్ సంఘం వ్యవస్థాపకులు జన్ను భాస్కర్, సలహాదారులు ఖల్‌నాయక్, ప్రధాన కార్యదర్శి వస్కుల విజయ్ మంత్రికి వినతి పత్రం ఇచ్చారు.
కలెక్టర్‌కు మంత్రి సురేఖ ఆదేశాలు
గ్రీవెన్స్‌కు ఫిర్యాదుల వెల్లువ


