‘చలి’ంచరా? | - | Sakshi
Sakshi News home page

‘చలి’ంచరా?

Dec 17 2025 6:35 AM | Updated on Dec 17 2025 6:35 AM

‘చలి’

‘చలి’ంచరా?

‘చలి’ంచరా? – 8లోu రేపటి నుంచి లెప్రసీ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ నిట్‌లో వర్క్‌షాప్‌ ప్రారంభం

న్యూస్‌రీల్‌

విలవిల్లాడుతున్న నిరాశ్రయులు

బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్‌ శ్రీ 202
‘నిరాశ్రయులకు జీవించే హక్కు ఉంది. వారికి అన్నపానీయాలతోపాటు కనీస మౌలిక వసతులు కల్పించాలి’ అని 2010లో సుప్రీం కోర్టు ఆదేశించింది. బల్దియాలు బాధ్యత తీసుకుని నిరాశ్రయులకు నీరు, ఆహారం, మరుగుదొడ్డి, పారిశుద్ధ్యం వంటి వసతులు కల్పించాలని సూచించింది. గ్రేటర్‌ వరంగల్‌ మహానగరంలో బల్దియా, మెప్మా అధికారులు, సిబ్బంది ప్రతీ ఏటా నిరాశ్రయులపై సర్వే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వందలాది మంది రోడ్ల వెంట, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తూ కనిపిస్తూనే ఉన్నారు. వారిపాలిట చలి యమపాశంలా మారింది. పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఫుట్‌పాత్‌లపై కాలం వెళ్లదీస్తున్న వారంతా చలి తీవ్రతకు అల్లాడిపోతున్నారు.

ఎంజీఎం: జిల్లాలో లెప్రసీ కేసులు గుర్తించడానికి, ప్రజలకు లెప్రసీపై అవగాహన కల్పించడానికి రేపటి (గురువారం) నుంచి 31వ తేదీ వరకు లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి క్యాంపెయిన్‌ నిర్వహణకు సంబంధించి జిల్లాలోని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో ఆయన జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. పీహెచ్‌సీల వారీగా హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, టీబీ, ఎన్‌సీడీ, మాతా శిశు సంక్షేమం కార్యక్రమాలు సమీక్షించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య మాట్లాడుతూ.. క్యాంపెయిన్‌లో భాగంగా.. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్‌రావు, ప్రోగ్రాం అధికారులు మహేందర్‌, హిమబిందు, ప్రభుదాస్‌, శ్రీనివాస్‌, రుబీనా, జిల్లా మాస్‌ మీడియా అధికారి అశోక్‌రెడ్డి ,హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అధికారి శ్రీనివాస్‌, డీపీఎంఓలు సతీశ్‌రెడ్డి, రవీందర్‌ పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: నిట్‌ సెమినార్‌హాల్‌ కాంప్లెక్స్‌లో స్పార్క్‌ (స్కీం ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ రీసెర్చ్‌ కొలాబరేషన్‌) సౌజన్యంతో సస్టేనబుల్‌ వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్‌ వర్క్‌షాప్‌ మంగళవారం ప్రారంభమైంది. నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్‌ వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. నిట్‌ వరంగల్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఎంసీ గిల్‌ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీన్‌ రీసెర్చ్‌ అండ్‌ కన్సల్టెన్సీ, ప్రొఫెసర్‌ శిరీష్‌ హరి సోనావానే, ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రొఫెసర్‌ ఎంఎం గంగేశ్వర్‌, ఎంసీ గిల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ విజయరాఘవన్‌, డీన్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ అర్బన్‌/కాజీపేట: విధి వక్రించి వీధిలో కాలం వెళ్లదీస్తున్నవారు కొందరు. యాచక వృత్తిలో జీవితాన్ని మోస్తున్నవారు ఇంకొందరు. దిక్కుమొక్కులేక ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు మరికొందరు. వీరంతా చలి విసురుతున్న పంజాకు విలవిల్లాడుతున్నారు. వీరికి ఆశ్రయం కల్పించాల్సిన బల్దియా అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామమాత్రంగా హోం లెస్‌ సెంటర్లు ఎక్కడో దూర ప్రాంతంలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని ఆరోపణలున్నాయి. కాగా, గ్రేటర్‌ మహా నగరంలో ఇలాంటి వారు వరంగల్‌లో 92 మంది, హనుమకొండ, కాజీపేటలో 38 మంది జీవిస్తున్నట్లు బల్దియా, మెప్మా అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.

హోంలెస్‌.. యూస్‌లెస్‌!

నగరంలో యాచకులు 586 మంది ఉన్నట్లు అధికారుల అంచనా. వీరికి భీమారంలోని పలివేల్పులలో 50 మంది చొప్పున ఆశ్రయం కల్పించి స్మైల్‌ ఎన్జీఓ ఆధ్వర్యంలో వైద్యం, ఆరోగ్యం, ఉపాధిపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా వరంగల్‌, కాజీపేట, హనుమకొండలో 130 మంది నిరాశ్రయులు ఉన్నట్లు అధికారుల అంచనా. వీరికి బల్దియా ఆధ్వర్యంలో పలివేల్పుల, వరంగల్‌ నగరంలోని ప్రతాప్‌నగర్‌లో హోం లెస్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం రాత్రి పూట నిద్రించేలా, ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేలా బల్దియా ఏర్పాట్లు చేసింది.

2 సెంటర్లు నామమాత్రమే

మహా నగర పాలక సంస్థలోని పలివేల్పుల, వరంగల్‌ రైల్వే స్టేషన్‌, నెహ్రూ పార్కుకు ఎస్‌ఎన్‌ఎం క్లబ్‌ పక్కన హోంలెస్‌ సెంటర్లు నిర్మించారు. రెండేళ్లలోనే క్లబ్‌ పక్కన ఉన్న సెంటర్‌ను కూల్చేసి, గాంధీనగర్‌లోని అంబేడ్కర్‌ సెంటర్‌లో ఆశ్రయం కల్పించారు. ఈ రెండు నైట్‌ షెల్టర్లు అందుబాటులో లేకపోవడం, సౌకర్యాలు నామామత్రమే కావడంతో నిరాశ్రయులు అక్కడికి వెళ్లేందుకు వ్యయప్రయాసాలతో కూడి ఉండడంతో ఆసక్తి చూపడం లేదు. ఈ సెంటర్ల నిర్వహణను ఆరేళ్ల కిందట ఎన్‌జీఓలకు అప్పగించారు. వరంగల్‌లోని సెంటర్‌ డాన్‌ బాస్కో, హనుమకొండ, కాజీపేటకు సంబంధించి పలివేల్పుల సెంటర్‌ను లార్డ్‌ ఎన్‌జీఓలు ఐదేళ్ల పాటు ఈ సంస్థలకు నామమత్రపు సొమ్ముతో నిర్వహణ బాధ్యలు చేపట్టారు. ఏడాది క్రితం వీరి కాంట్రాక్టు గడువు ముగిసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వీరే ఈ సెంటర్లను నిర్వహించాలి. కానీ వీరు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొద్ది నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం యాచక వృత్తిని నిర్మూలన కోసం ప్రత్యేక ఎన్జీఓలను నియమించింది. అందులో భాగంగా ప్రస్తుతం స్మైల్‌ ఎన్‌జీఓ యాచకుల జీవితాలు మార్చడానికి కృషి చేస్తోంది. యాచకులను గుర్తించి కేంద్రానికి తరలించి ముడు నెలల పాటు విద్య, వైద్యం, జీవనోపాధిపై కౌన్సెలింగ్‌ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తోంది.

గోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో తులసిమాల చూపిస్తున్న ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి

కాజీపేట, వరంగల్‌ రైల్వే స్టేషన్ల సమీపంలో, హనుమకొండ బస్‌ స్టేషన్‌ సమీపంలో ఫుట్‌పాత్‌లపై పదుల సంఖ్యలో నిరాశ్రయులు, యాచకులు చలిలో విలవిల్లాడుతున్నారు. కనీసం కప్పుకోవడానికి సైతం చద్దర్లు లేక అలమటిస్తున్నారు. వారిలో చిన్నపిల్లలు సైతం ఉన్నారు. పోలీసులు రైల్వే స్టేషన్లలో, బస్‌ స్టేషన్లలో తమ ను నిద్రపోనివ్వడం లేదని, పోకిరీలు తమను ఆటపట్టిస్తున్నారని..బల్దియా అధికారులు స్పందించి తమకు ఆశ్రయం కల్పించాలని వారంతా కోరుతున్నారు. కాగా, హోంలెస్‌ సెంటర్ల నిర్వహణపై మెప్మా టీఎంసీ రమేశ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయా కేంద్రాల్లో నిరాశ్రయులు రాత్రివేళల్లో ఉంటున్నారని, తెల్లవారుజామున వెళ్లిపోతున్నారని తెలిపారు.

గ్రేటర్‌లో చలిపంజాకు

నిరాశ్రయుల విలవిల

నైట్‌ షెల్టర్లపై అంతులేని నిర్లక్ష్యం

దూర ప్రాంతాల్లో ఉండడంతో

నిరుపయోగం

హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట

మండలాల్లో..

వరంగల్‌ జిల్లాలో ఖానాపురం,

చెన్నారావుపేట, నర్సంపేట,

నెక్కొండ మండలాల్లో పోలింగ్‌

ఏర్పాట్లు పరిశీలించిన సీపీ,

జిల్లా ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్లు

‘చలి’ంచరా?1
1/3

‘చలి’ంచరా?

‘చలి’ంచరా?2
2/3

‘చలి’ంచరా?

‘చలి’ంచరా?3
3/3

‘చలి’ంచరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement