గ్రామాలను అభివృద్ధి చేయాలి : ఎర్రబెల్లి
హన్మకొండ: నూతన సర్పంచ్‌లు నిబద్ధతతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మంగళవారం హనుమకొండ రాంనగర్‌లోని స్వగృహంలో పర్వతగిరి, వర్ధన్నపేట, ఐనవోలు, హసన్‌పర్తి మండలాల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో విజయం సాధించిన నూతన సర్పంచ్‌లను ఎర్రబెల్లి దయాకర్‌రావు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సహకరించకపోయినా సర్పంచ్‌లు ధైర్యంగా ఉండండి.. మీ వెనుక పార్టీ, కేసీఆర్, తాను ఉన్నాను.. ప్రజల పక్షాన కొట్లాడి నిధులు సాధించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని బీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. మేజర్ గ్రామాలన్నీ బీఆర్‌ఎస్ వైపే ఉన్నాయని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ముందంజలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, నూతన సర్పంచ్‌లు పాల్గొన్నారు.


