అప్పట్లో డబ్బుల ప్రభావం లేదు
మాది కొత్తపల్లిగోరి గ్రామం. నేను 1995–2001 సంవత్సరాల మధ్య సర్పంచ్‌గా పని చేశా. అనంతరం 2001–2006 వరకు మా భార్య కాటం స్వరూప సర్పంచ్‌గా పని చేశారు. అప్పడు కేవలం ఎన్నికల ఖర్చు రూ.14వేలు మాత్రమే వచ్చింది. ఆ రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే వారికి పెద్దగా ఖర్చులు ఉండేవి కావు. డబ్బుల ప్రభావం అంతగా లేదు. ఇప్పుడు డబ్బు లేనిదే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. ఎవరికి ఏ పని ఉన్నా నేను వెంట ఉండి చేయించేవాడిని. ఒక్క పైసా ఆశించేవాడిని కాదు. ప్రజలకు సేవ సేవ చేయడమే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తి భిన్నమైంది.
– కాటం సదయ్య, కొత్తపల్లిగోరి
అప్పట్లో డబ్బుల ప్రభావం లేదు


