నేటినుంచి ధనుర్మాసోత్సవాలు..
హన్మకొండ కల్చరల్: ధనుర్మాసోత్సవాలు నేటి (మంగళవారం) నుంచి జనవరి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం పలు వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్‌లోని బాలా వెంకటేశ్వరాలయం, హనుమకొండ గోపాల్‌పూర్ సదాశివ కాలనీలోని గోదామాధవ ఆధ్యాత్మిక ప్రచారకేంద్రంలో ధనుర్మాసోత్సవాలు జరగనున్నాయి. గోదామాధవ కేంద్రం ఆచా ర్యుడు డాక్టర్ ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి ఆధ్వర్యంలో మంగళవారం ఉద యం నుంచి స్వామివారికి అభిషేకం, అలంకరణ, ఆపదుద్ధారక పారాయణం, ప్ర త్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఎకై ్సజ్‌కాలనీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయం, అదాలత్ వెనుకగల ఎస్వీ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయం తదితర వైష్ణవ దేవాలయాలలో భక్తులకు ఏర్పాట్లు చేశారు.
వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేక ఏర్పాట్లు


