ఇక.. ఇక్కట్‌లు ఉండవు
సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు..
జంపన్న వాగు వద్ద టవర్ల నిర్మాణం..
మేడారం జాతరలో నిరంతరాయంగా విద్యుత్
జాతరలో వేగంగా విద్యుత్ పనులు..
హన్మకొండ : సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే మే డారం, పరిసరా ప్రాంతాల్లో నిరంతరాయంగా వి ద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా యి. దాదాపు రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ప నులు చేపట్టారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మహాజాతరకు వారం రో జుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈలోపు విద్యుత్ సరఫరా పనులు యు ద్ధ ప్రాతిపదిక జరుగుతున్నాయి. ప్రస్తుతమున్న మే డారం 33/11 కేవీ, సమ్మక్క 33 /11 కేవి సబ్ సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా జరిగేలా లైన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రెండు సబ్ స్టేషన్లపై భారం పడకుండా నార్లాపూర్ వద్ద కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు గట్టమ్మ దేవాలయం వద్ద విద్యుత్ సమస్య తలెత్తకుండా ఇక్కడ కూడా కొత్తగా 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారు. జాతర నాటికి ఈ రెండు సబ్ స్టేషన్‌లు వినియోగంలోకి రానున్నా యి. వీటి నిర్మాణంతో అంతకు ముందున్న సబ్ స్టేషన్లపై భారం తగ్గి బ్రేక్‌డౌన్లు, అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరగనుంది.
కవర్ కండక్టర్‌తో విద్యుత్ లైన్..
11 కేవీ విద్యుత్ లైన్‌కు కొక్కెలు వేయడం, చెట్ల కొమ్మలు తాకడం, ఇతరత్రా కారణాలతో గతంలో విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయాలు కలిగే ది. ఈ సారి ఈ సమస్యను అధిగమించేందుకు 25 కిలో మీటర్ల పొడవునా కవర్ కండక్టర్ ద్వారా 11 కేవీ విద్యుత్ లైన్ నిర్మిస్తున్నారు. 15 కిలో మీటర్లు 33 కేవీ విద్యుత్ లైన్ కవర్ కండక్టర్‌తో వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లు తెగిపడితే ప్రమాదం జరిగే అవకాశముండడంతో లైన్లు తెగి కింద పడకుండా ఫోర్ వైర్ స్పేషర్స్ ఏర్పాటు చేస్తున్నారు.
పెట్రోలింగ్ టీమ్‌లు ఏర్పాటు..
జాతరలో విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తకుండా 50 స్థానాల్లో 50 బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వీరు నిరంతరాయంగా అందుబాటులో ఉంటారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తిన వెంటనే పరిష్కరిస్తారు. అదే విధంగా 33 కేవీ లైన్లలో పస్రా నుంచి మేడారం, తాడ్వాయి నుంచి స మక్క సబ్‌స్టేషన్ వరకు పెట్రోలింగ్ టీమ్‌లను ని యమించనున్నారు. సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిదిద్దేందుకు ఎమ్మార్టీ టీ మ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో జాతర సాగనుంది.
విద్యుత్ సబ్ స్టేషన్లపై భారం పడకుండా మేడారం, సమ్మక్క సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచారు. అదే విధంగా 132 కేవీ సబ్ స్టేషన్ నుంచి వచ్చే ఫీడర్‌లో ఏదైనా అవాంతరం ఎదురైతే విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పస్రా 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి మేడారం, సమ్మక్క 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఇక్కడ సమస్య ఉత్పన్నమైతే ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాను కమలాపూర్ 132/33, ములుగు 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా విద్యుత్ సరఫరాలో వైఫల్యాలకు తావు లేకుండా 259 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు.
జంపన్న వాగు వద్ద భక్తుల రక్షణ, ప్రమాదం జరగకుండా విద్యుత్ లైన్ల ఎత్తు పెంచేందుకు 180 మీటర్ల పొడవున 6 టవర్లు నిర్మిస్తున్నారు. ఈ టవర్ల ద్వారా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ వేస్తున్నారు. గతంలో విద్యుత్ లైన్‌ను వాహనాలు క్రాస్ చేసే సమయంలో లైన్లకు నష్టం వాటిల్లడంతోపాటు ప్రమాదకారంగా మారేవి. ఈ సమస్యను అధిగమించేందుకు టవర్లు నిర్మిస్తున్నారు.
వేగంగా ఏర్పాట్లు..
రెండు సబ్‌స్టేషన్ల ద్వారా సరఫరా
సబ్ స్టేషన్ల సామర్థ్యం పెంపు
నార్లాపూర్, గట్టమ్మ దేవాలయం వద్ద
నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం
259 విద్యుత్ డిస్ట్రిబ్యూషన్
ట్రాన్స్‌ఫార్మర్ల్ల ఏర్పాటు
అంతరాయాలు లేకుండా కవర్
కండక్టర్‌తో 11 కేవీ విద్యుత్‌లైన్
జంపన్న వాగు వద్ద ఆరు టవర్ల నిర్మాణం
మేడారం జాతర విద్యుత్ సరఫరా పనులు వేగంగా జరుగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరలో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జాతర విజయవంతంలో విద్యుత్ శాఖది కీలక పాత్ర. ప్రతీ పనిని నాణ్యతతో చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులుండవు.
కర్నాటి వరుణ్ రెడ్డి, సీఎండీ, టీజీ ఎన్పీడీసీఎల్
ఇక.. ఇక్కట్‌లు ఉండవు


