నాడు భార్య.. నేడు భర్త
● సర్పంచ్‌లుగా దంపతులు ఎన్నిక
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్‌చర్ల గ్రామ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.డి ఆజామ్ గెలుపొందారు. 2019లో ఆయన భార్య ఖలీల్‌బేగమ్ కూడా బీఆర్‌ఎస్ నుంచి సర్పంచ్‌గా గెలుపొందింది. ఇప్పుడు అదే గ్రామం జనరల్ అన్‌రిజర్వ్ అయ్యింది. దీంతో ఆజామ్ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పిన్నింటి కావ్యశ్రీపై గెలుపొందారు. రెండు సార్లు సర్పంచ్‌గా ఆదరించిన గ్రామస్తులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.


