నిన్న ఎన్నికల పోరులో.. నేడు జీవన పోరాటంలో
బయ్యారం: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ బయ్యారం ఉప సర్పంచ్‌గా ఎన్నికై న ఎనుగుల ఉమ. నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా ఎన్నికల పోరులో పాల్గొన్న ఆమె.. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగా నేడు జీవన పోరాటంలో నిమగ్నమైంది. బయ్యారం ఆరో వార్డు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉమ సోమవారం ఉప సర్పంచ్‌గా ఎన్నికై ంది. ఎన్నిక తర్వాత మంగళవారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబెడుతోంది. ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
సర్పంచ్ బరిలో తోటికోడళ్లు
కొడకండ్ల : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొడకండ్ల సర్పంచ్ పదవికి తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. కొడకండ్ల జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు మసురం వెంకటనారాయణ సతీమణి రాధాలక్ష్మి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా, మసురం లక్ష్మీనర్సింహాస్వామి సతీమణి మమత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలించారు. కాగా, కొడకండ్ల సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
నిన్న ఎన్నికల పోరులో.. నేడు జీవన పోరాటంలో
నిన్న ఎన్నికల పోరులో.. నేడు జీవన పోరాటంలో
నిన్న ఎన్నికల పోరులో.. నేడు జీవన పోరాటంలో


