నేడు గ్రేటర్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఎంతోగానో ఉపకరిస్తుందని, నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
సౌత్‌జోన్ వర్సిటీ టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: చైన్నెలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ వాలీబాల్ ఉమెన్స్ జట్టు పాల్గొననున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వై.వెంకయ్య ఆదివారం తెలిపారు. ఈజట్టులో ఎం.శ్యామల, ఎ.నందిని, పి.ఉమ, యు.మాధురి, షేక్ ఆఽశాబేగం, జి.ఐశ్వర్య, బి.అక్షిత, ఎం.మౌనిక, జె.సుప్రజ, వి.వెన్నెల, బి.ఆశ, ఎస్.శ్రీలత, జె.పావని, జి.వెన్నెల ఉన్నట్లు వెంకయ్య తెలిపారు. వరంగల్ కిట్స్ ఫిజికల్ డైరెక్టర్ కె.వీరస్వామి కోచ్‌గా, కొత్తగూడెం (టీజీటీడబ్ల్యూఆర్డీసీ ఉమెన్) ఫిజికల్ డైరెక్టర్ డి.శ్వేత మేనేజర్‌గా వ్యవహరించనున్నట్లు వెంకయ్య తెలిపారు.
వరంగల్ అర్బన్: సూరత్‌లోని ప్రఖ్యాత లక్ష్మీపతి టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీనీ ఆదివారం గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సందర్శించారు. ఇండస్ట్రీ నిర్వహణను పరిశీలించారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరుగుతున్న ఆల్ ఇండియా 116వ మేయర్‌ల సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈసందర్భంగా మేయర్లతో కలిసి 40 ఎంఎల్‌డీ టెర్షిషియరీ (తృతీయ) శుద్ధి కర్మాగారాన్ని సందర్శించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా వచ్చే నిధులతో నగరంలో 15 ఎంఎల్‌డీ సామర్థ్యంతో టెర్షిషియరీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సూరత్ లో నిర్వహించే ప్లాంట్ నుంచి వచ్చే వాటర్‌ను అమ్మడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని, నగరంలోనూ అదే తరహా విధానాలు అవలంబించనున్నట్లు పేర్కొన్నారు. తడి వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చడంపై పౌరులకు అవగాహన కల్పించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాంట్రాక్ట్ అసిస్టెంట్
ప్రొఫెసర్‌కు షాక్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో పార్ట్‌టైం అధ్యాపకుడిగా పని చేస్తూ కొన్నేళ్ల క్రితం పోస్ట్ డాక్టరల్ ఫెల్లో షిప్ (పీడీఎఫ్) పొందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకరయ్యకు ఎదురు దెబ్బ తగిలింది. పార్ట్‌టైం అధ్యాపకుడిగా పని చేస్తూ పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్ పొందడం నిబంధనలకు విరుద్ధమని పోస్ట్ డాక్టరల్‌ను తిరిగి రీఫండ్ చేయాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఈ నెల 10న ఆదేశాలు జారీ చేశారు. పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్‌గా పొందిన రూ. 6,89,400 కేయూ యూజీసీకి నెలరోజుల్లో రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. శంకరయ్య ప్రస్తుతం హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు విభాగంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
బ్రాహ్మణ సేవా సంఘం
జిల్లా అధ్యక్షుల నియామకం
కాజీపేట: అఖిల భారతీయ బ్రాహ్మణ సేవా సంఘం (చాణక్య దళ్)ను పటిష్టంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతనంగా జిల్లా అధ్యక్షులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు అయినవోలు మల్లిఖార్జున శాస్త్రి తెలిపారు. కాజీపేటలో ఆదివారం సంఘం సభ్యులతో కలిసి జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. చిలుకపాటి వెంకటశివకుమార్ (హనుమకొండ), గూడా వెంకటరమణ శర్మ (వరంగల్ అర్బన్), కాంచనపల్లి సిద్ధేశ్వర శర్మ (వరంగల్), యల్లంబట్ల కరుణాకర శర్మ (జనగామ), కొట్లావజ్జుల రామమూర్తి శర్మ (మహబూబాబాద్), విరాళ చంద్రశేఖర్ శర్మ (సిద్దిపేట), చిన్నోజుల లక్ష్మీరాజం శర్మ (రాజన్న సిరిసిల్ల), జి.శ్రావణ్ కుమార శర్మ (జయశంకర్ భూపాలపల్లి)ను నియమించారు. ఈ మేరకు నూతన అధ్యక్షులకు నియామక పత్రాలు అందించి అభినందించారు.
నేడు గ్రేటర్ గ్రీవెన్స్


