రెండు ఓట్లతో లచ్చమ్మ గెలుపు
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం సూదన్‌పల్లిలో ఫ్యామిలీ పోరు జోరుగా సాగింది. గ్రామానికి చెందిన ఆకారపు లచ్చమ్మ (కాంగ్రెస్ రెబల్), ఆమె కూతురు శైలజ(కాంగ్రెస్ రెబల్) పోటీలో ఉన్నారు. వీరితో పాటు శైలజ బావ కోడలైన తిక్క మాధవి (కాంగ్రెస్), మాధవి అత్త అయిన జయమ్మ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఫ్యామిలీ పోరులో తిక్క మాధవికి 292 ఓట్లు రాగా, అకారపు లచ్చమ్మకు 294 ఓట్లు వచ్చాయి. రెండు ఓట్ల తేడాతో మనవరాలిపై అమ్మమ్మ (లచ్చమ్మ) సర్పంచ్‌గా ఎన్నికై ంది. కాగా, జయమ్మకు ఏడు, శైలజకు 74 ఓట్లు వచ్చాయి.
మాజీ సర్పంచ్ భర్తపై
మాజీ ఉప సర్పంచ్ గెలుపు
మడిపల్లిలో మాజీ సర్పంచ్ చిర్ర సుమలత భర్త చిర్ర విజయ్‌కుమార్‌పై మాజీ ఉప సర్పంచ్ బుర్ర రంజిత్‌కుమార్ 21 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. లెక్కింపు సందర్భంగా విజయ్‌కుమార్‌కు 910కు పోలవ్వగా, రంజిత్‌కుమార్‌కు 930 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటు రంజిత్‌కు నమోదైంది.


