ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత
విద్యారణ్యపురి: ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత అని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో ‘ఇండియా 2047 రియలైజింగ్ ది విజన్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఈక్విటబుల్ అండ్ సస్టెయినబుల్ రిపబ్లిక్’ అంశంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. ఇలాంటి జాతీయ సదస్సుల్లో చర్చల ద్వారా పలు అంశాలపై అవగాహన పెంపొందుతుందన్నారు. ఈసదస్సులో విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్, ఆల్‌ఇండియా ఫోరం ఫర్ రైట్ ఎడ్యుకేషన్ మెంబర్ ప్రిసిడియం డి రమేష్ పట్నాయక్ హాజరై మాట్లాడారు. పబ్లిక్ పాలసీ ఎక్స్‌పర్ట్ అండ్ కన్సల్టెంట్ ఎట్‌ది ఫెస్టిసైడ్ ఆక్షన్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రొఫెసర్ దొంతి నర్సింహారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి, సదస్సు కన్వీనర్ డాక్టర్ సామ్యూల్ ప్రవీణ్‌కుమార్, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాగేషన్, ప్రఖ్యాత ట్రాన్స్‌జెండర్ రచన మందరబోయిన, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుహాసిని, అధ్యాపకులు సురేశ్‌బాబు, ఎం.అరుణ, సుజాత, మధు, కె.శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, పద్మ, సారంగపాణి, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. 46 మంది పరిశోధన పత్రాలు సమర్పించారు. పాల్గొన్న ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు
ప్రొఫెసర్ కోదండరాం
ముగిసిన జాతీయ సదస్సు


