సకాలంలో పరిహారం అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో అత్యాచార కేసుల్లో బాధితులకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అత్యాచార కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లింపుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యాచార బాధితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. ప్రతీ రెండు నెలలకోసారి కమిటీ సమావేశమవ్వాలని, అందులో చర్చించే అంశాలను ముందస్తుగా తెలియజేయాలన్నారు. అదేవిధంగా అధికారులు అత్యాచార ఘటనలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ నిర్మల, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమకళ, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ సంజీవరావు, ఇన్‌చార్జ్ డీసీపీఓ ఎస్.ప్రవీణ్ కుమార్, ఈఓ సింధురాణి, డీవీ యాక్ట్ కౌన్సిలర్ పావని, భరోసా ఎస్సై శ్రీలత, పీఎంహెచ్‌ఎన్ డాక్టర్ రూబీన, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులున్నారు.


