సేవల వినియోగంపై చైతన్యపర్చాలి
ఎంజీఎం: ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకునేలా చైతన్యపర్చాలని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది ఎం.కవిత అన్నారు. శుక్రవారం లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో న్యాయవాది కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకుని వైద్య పరంగా ప్రజలు ఖర్చు తగ్గించుకునేలా అవగాహన కలిగించడంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు పారా లీగల్ వలంటీర్లు కూడా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న ఆరోగ్య కుటుంబ సంక్షేమ సేవలు, ఉచితంగా అందించే డయాగ్నస్టిక్ సేవలు, మందులు, వైద్య సలహాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒత్తిడిని అధిగమించడం అలాగే మంచి ఆహారపు అలవాట్ల ద్వారా జీవనశైలి వ్యాధులు నియంత్రించవచ్చన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా హనుమకొండ డీఎల్‌ఎస్‌ఏ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈకార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్‌రెడ్డి, హెల్త్ సూపర్‌వైజర్లు ఈ.బాబు, మరియా థామస్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.


