గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలి | - | Sakshi
Sakshi News home page

గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలి

Dec 13 2025 7:17 AM | Updated on Dec 13 2025 7:17 AM

గైర్హ

గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలి

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: మొదటి విడతలో ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పనను వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులకు గుర్తుచేశారు. అధికారులు పోలింగ్‌ రోజున ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెెక్టర్‌ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర వాలీబాల్‌ జట్టు

కోచ్‌గా జీవన్‌గౌడ్‌

వరంగల్‌ స్పోర్ట్స్‌: రాజస్తాన్‌ రాష్ట్రం ఝాంజహు జిల్లాలోని పీలానీలో ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్న 49వ జూనియర్‌ జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టు కోచ్‌గా హనుమకొండ డీఎస్‌ఏ కోచ్‌ బత్తిని జీవన్‌గౌడ్‌ నియమితులయ్యాడు. ఈ మేరకు తెలంగాణ వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల రమేష్‌బాబు, ఎన్‌వీ హన్మంతరెడ్డి శుక్రవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. హనుమకొండ జిల్లా పంథిని గ్రామానికి చెందిన జీవన్‌గౌడ్‌ జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ వాలీబాల్‌ కోచ్‌గా జేఎన్‌ స్టేడియంలో విధులు నిర్వహిస్తున్నాడు. జాతీయస్థాయిలో తెలంగాణ నుంచి ప్రా తినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జట్టుకు కోచ్‌గా ఎంపికై న జీవన్‌గౌడ్‌ను డీవైఎస్‌ఓ గుగులోత్‌ అశోక్‌కుమార్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ బాధ్యులు, క్రీడాకారులు అభినందించారు.

15నుంచి

ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు

కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిపాలనాభవనంలో ఉద్యోగులకు ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌) హాజరును ఈనెల 15నుంచి అమలుచేయనున్నట్లు శుక్రవారం రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి సమక్షంలో ఈ కొత్త హాజరు విధానాన్ని ప్రారంభించనున్న ట్లు పేర్కొన్నా. మొదటి విడతగా యూనివర్సిటీ క్యాంపస్‌ కాలేజీ, దూరవిద్యాకేంద్రం, ఫార్మసీ కాలేజి, కో–ఎడ్యుకేషన్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, పరీక్షల విభాగం, హా స్టళ్ల కార్యాలయాల్లో ఈ ముఖగుర్తింపు హాజ రును తప్పనిసరి చేయనున్నట్లు వివరించారు.

‘ఓపెన్‌’ అడ్మిషన్లకు

అవకాశం

విద్యారణ్యపురి: ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌లో ఈ విద్యాసంవత్సరం 2025–26లో ప్రవేశాలకుగాను తత్కాల్‌ స్కీంలో భాగంగా మరోసారి అవకాశం కల్పించారు. అపరాధ రుసుంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని హనుమకొండ డీఈఓ ఎల్‌వి గిరిరాజ్‌గౌడ్‌, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఎ.సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. టాస్‌ వెబ్‌సైట్‌ హెచ్‌టీటీఎస్‌//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణస్కూల్‌.ఓఆర్‌జీ లేదా మీసేవా , టీజీఆన్‌లైన్‌ సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత డాక్యూమెంట్లు అక్రిడిటెడ్‌ విద్యాసంస్థలో హైస్కూల్స్‌, కాలేజీల్లో సంబంధిత దరఖాస్తుతోపాటు సమర్పించాలన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

గైర్హాజరైన వారికి  నోటీసులు జారీ చేయాలి1
1/1

గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement