లక్ష్యంతో చదివితే ఉన్నతస్థితికి..
కేయూ క్యాంపస్: విద్యార్థులు పట్టుదల, లక్ష్యంతో చదివితే ఉన్నత స్థితికి చేరుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజీ పరిధిలోని అన్ని విభాగాల్లో ఈ విద్యాఏడాది పీజీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేయూలోని ఆడిటోరియంలో ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాకతీయ స్వర్ణోత్సవ విద్యార్థిగా గర్వపడాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. పరిపక్వత చెందిన పీజీ విద్యార్థులుగా నాలెడ్జ్ అటిట్యూడ్ స్కిల్స్, లీడర్‌షిప్, వ్యక్తిత్వంపై దృష్టి సారించాలన్నారు. కాకతీయ యూనివర్సిటీని డ్రగ్స్ రహిత, ఆల్కాహాల్ రహిత క్యాంపస్‌గా మార్చుకుందామన్నారు. త్వరలో ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరును కూడా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కలిగిన కేయూలోని కే హబ్‌ను రూసానిధులతో వినియోగంలోనికి తీసుకురానున్నట్లు చెప్పారు. టీ హబ్‌తో ఎంఓయూతో కూడా ముందుకెళ్లబోతున్నామన్నారు. ఆంగ్ల భాషపై పట్టు సాధించాలన్నారు. ఏసీపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. ర్యాంగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నార్కోటిక్స్ డిప్యూ టీ కమిషనర్ రమేష్‌కుమార్ మాట్లాడుతూ.. మా దక ద్రవ్యాలకు బానిసలు కావొద్దన్నారు. మాదక ద్రవ్యాలు వాడిని విక్రయించినా నేరమేనన్నారు. ప్రముఖ న్యాయవాది మాతంగి రమేష్‌బాబు మాట్లాడుతూ లీగల్ అవేర్నెస్ ఆన్ సెక్సువల్ హరాస్మెంట్ అండ్ స్టూడెంట్ రైట్స్ అనే అంశంపై మాట్లాడారు. ప్రతి కళాశాలలో ఇంటర్నల్ కంప్లెయింట్ సెల్ ఉండాలన్నారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ పాలకమండలి సభ్యులు సురేష్‌లాల్, డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ రమ, సైన్స్ డీన్ ఆచార్య హనుమంతు, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, ఆచార్య వెంకయ్య, డాక్టర్ సుజాత, డాక్టర్ రాధికారాణి, దీపాజ్యోతి, డాక్టర్ మేఘనరావు, మమత, డాక్టర్ శంకర్, హాస్టల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆంగ్ల భాషపై పట్టుసాధిస్తే
ఉపాధి అవకాశాలు
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి


