అనుమానాస్పద స్థితిలో నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ మృతి
ధర్మసాగర్ : అనుమానాస్పద స్థితిలో నిట్ ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని రిజర్వాయర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట సుబ్బారెడ్డి(43) వరంగల్ ఎన్‌ఐటీలో కంప్యూటర్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఎన్‌ఐటీ క్యాంపస్‌లో నివాసం ఉంటున్నాడు. కొన్ని రోజులుగా మానసిక రుగ్మతతో బాధపడుతూ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతని మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో రిజర్వాయర్‌లో పడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మృతిచెందాడా.. లేదా.. ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సుబ్బారెడ్డికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్ రావు తెలిపారు.
మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం
కాజీపేట: కాజీపేట మండలం దర్గాకాజీపేటలో మహిళా న్యాయవాది యామినిపై ప్రవీన్ కుమార్ అనే యువకుడు హత్యాయత్నం చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. బాధితురాలి తండ్రి వీరస్వామి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిన మేరకు.. సీఐ తెలిపిన వివరాలి ఉన్నాయి.. న్యాయవాదిగా పనిచేసే యామినికి ఓ కేసు విషయంలో ప్రవీన్‌కుమార్‌తో వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహించిన ప్రవీన్‌కుమార్ చేతిలో ఉ న్న కత్తెరతో దాడిచేయగా స్వల్పంగా గాయపడింది. వెంటనే బాధితురా లిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. వీరస్వామి ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యాయత్నం చేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హనుమకొండ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్త రవి బాధితురాలిని ఆస్పత్రిలో పరామర్శించినట్లు సమాచారం.


