పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
కమలాపూర్: మండలంలోని శంభునిపల్లి ప్రాథమిక పాఠశాల, ఉప్పల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం పరిశీలించారు. కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించి, పోలింగ్ కేంద్రాల వారీగా త్వరగా పూర్తి చేసేలా అధికారులకు పలు సూచనలిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ నిర్వహణతో పాటు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్‌కుమార్, స్పెషల్ ఆఫీసర్ నరసింహస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాయపర్తి
87.34%
పర్వతగిరి
86.59%
వర్ధన్నపేట
85.65%
కమలాపూర్
72.75%
ఎల్కతుర్తి
86.17%
భీమదేవరపల్లి
82.61%
సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో మొదటి విడత పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్, లెక్కింపు, ఫలితాల వెల్లడి కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలు ఊపిరి పీల్చుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఉదయం నుంచి ఉత్సాహంగా ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రాల్లో ఉన్న ఓటర్లకి అధికారులు స్లిప్పులు ఇచ్చి నంబర్లు వేసి పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు బారులుదీరి ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని మూడు మండలాల్లో ఓట ర్లు 1,28,651 ఉండగా 1,08,003 ఓట్లు పోలయ్యాయి. , వీరి లో పురుషులు 62,653మందికిగాను 53,026మంది, మహిళలు 65,997 మందికిగాను 54,976మంది ఓటు హక్కు విని యోగించుకోగా, మొత్తం 83.95శాతం పోలింగ్ నమోదైంది.
ఉత్సాహంగా ఓటేసిన గ్రామాలు
వరంగల్ జిల్లాలో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని 731 పొలింగ్ స్టేషన్లలో ఓట్ల జాతర సాగింది. జిల్లాలోని 80 గ్రామ పంచాయతీలు, 585 వార్డు స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 1,10,487 మంది ఓటర్లకు గానూ 95,939 మంది ఓటేశారు. ఈ లెక్కన 86.83 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేశారు.
మహిళలే ఎక్కువున్నా
ఓటేసింది ఎక్కువగా పురుషులే
జిల్లాలోని ఈ మూడు మండలాల్లో 54,519 మంది పురుష ఓటర్లు, 55,967 మంది మహిళ ఓటర్లు, ఇతరులు ఒకరు ఉన్నారు. అయితే వీరిలో 47,593 మంది పురుషులు, 48,345 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఓటేశారు. అయితే పురుషుల కన్నా మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఎక్కువగా 87.30 శాతం మంది పురుషులు ఓటేయగా, 86.38 శాతం మహిళలు ఓటేశారు.
రెండో స్థానంలో బీఆర్‌ఎస్, 56 మంది ఇతరుల
విజయం
స్వతంత్రులతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మంతనాలు
తొలి విడతఓటింగ్ జరిగిందిలా..
హనుమకొండ జిల్లా..
మండలం ఓటర్లు ఓటేసినవారు
భీమదేవరపల్లి 40,897 33,783
ఎల్కతుర్తి 31,915 27,621
కమలాపూర్ 55,839 46,599
వరంగల్ జిల్లాలో..
వర్ధన్నపేట 28,358 24,290
పర్వతగిరి 38,631 33,449
రాయపర్తి 43,498 38,200
మరిన్ని ఎన్నికల వార్తలు : 10లో..
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్


