డీఈఓగా గిరిరాజ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్‌ఏసీ ) డీఈఓగా ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ కార్యాలయంలో సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్లు బి.మహేశ్, బద్దం సుదర్శన్‌రెడ్డి, బండారు మన్‌మోహన్, సునీత, రఘుచందర్, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ ఎ.సదానందం, ఫైనాన్స్ అకౌంటింగ్ ఆఫీసర్ మధుసూదన్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి సన్మానించారు. ఈసందర్భంగా గిరిరాజ్ మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని, కలిసికట్టుగా పని చేద్దామని ఉద్యోగులకు సూచించారు.
డీఈఓకు సన్మానం
గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జనరల్ సెక్రటరీ నెహ్రూనాయక్, ట్రెజరర్ సంధ్యారాణి, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫలితశ్రీహరి ఇతర బాధ్యులు డీఈఓను కలిసి సన్మానించి పూలమొక్క అందించారు.
హన్మకొండ కల్చరల్: తొలి వేద పాఠశాలను ఏర్పాటు చేసి, వేలాది మంది వేద పండితులను అందించిన విశ్వనాథ శాస్త్రి కృషితోనే వేద శాస్త్రాలు పరివ్యాప్తమయ్యాయని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వరంగల్ శంభునిపేటలోని నాగేశ్వరస్వామి దేవస్థానం కల్యాణ మండపంలో తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, ఆయుర్వేద ఆచార్యులు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి జయంతోత్సవం వైభవంగా నిర్వహించారు. శృంగేరి శారదాపీఠం దర్శనం పత్రిక సంపాదకులు మరుమాముల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు జ్యోతిప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. విశ్వనాథ శాస్త్రి పాదుకలకు శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు పాల్గొన్నారు.
ఎంజీఎం: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హనుమకొండలోని మైత్రి శ్రీ ఫెర్టిలిటీ సెంటర్‌లో గురువారం డ్రగ్ అధికారులు దాడి చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న రూ.5.82 లక్షల విలువైన డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ అఽధికారులు తెలిపారు. డ్రగ్స్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకానికి ఉంచిన ఈ నిల్వలను డీసీఏ అధికారులు గుర్తించారు. ఈప్రాంగణంలో వంధ్యత్వానికి చికిత్స చేయడానికి ఉపయోగించే స్టెరాయిడ్లు, హర్మోన్ల కోసం ఉపయోగించే ఔషధాలు, మొత్తం 35 రకాల మందులను గుర్తించినట్లు తెలిపారు. ఈదాడిలో వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి.రాజ్యలక్ష్మి, హనుమకొండ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్, జనగామ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిలో పాలన రోజురోజుకూ ఆస్తవ్యస్తంగా మారుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ పాలనపై పరిపాలనాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. వరంగల్ సీకేఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా.. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ప్రసవ చికిత్సలు పొందుతుంటారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్యం, భోజన సౌకర్యాలు కల్పించాలి. ఈక్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్ ప్రక్రియ రాష్ట్ర పరిధిలో ఉండగా, రోగులకు భోజనం అందించే డైట్ టెండర్ జిల్లా పరిధిలో ఉంటుంది. వరంగల్ కలెక్టర్ సత్యశారద స్వయంగా డైట్‌ను పరిశీలించిన సమయంలో టెండర్‌ను రెన్యూవల్ చేయకుండా నూతన టెండర్ పిలవాలని ఆదేశించారు. ఏప్రిల్‌లో డైట్ టెండర్ పిలిచారు. ఇందులో భాగంగా పలువురు కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొని ఈఎండీలు సైతం చెల్లించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టర్ టెండర్ ప్రక్రియలో ఉన్న చిన్నపాటి తప్పిదాలతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టెండర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు 8 నెలలుగా ఈఎండీలు చెల్లించకపోవడంతో పాటు కోర్టులో సమస్యను పరిష్కరించడంలో పరిపాలనాధికారులు విలఫమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డీఈఓగా గిరిరాజ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ


