‘నమస్తే’ను వినియోగించుకోవాలి
వరంగల్ అర్బన్: డీ స్లడ్జింగ్ ఆపరేటర్లు,సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు ‘నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైడ్జ్ శానిటేషన్ ఏకో సిస్టిమ్)ను సద్వియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో బుధవారం ‘నమస్తే’ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ.. మల వ్యర్థాలు నిర్వహించే సిబ్బందికి ఈకార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి సెప్టిక్ ట్యాంకుల డీ–స్లడ్జింగ్ తప్పనిసరిగా చేపట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు టోల్ ఫ్రీ నంబర్ 11420పై ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్‌మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్లాంట్ ఏర్పాటు వేగం చేయండి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బయో మిథనైజేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి చర్యలు వేగంగా కొనసాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. గురువారం హనుమకొండలోని మున్సిపల్ అతిథి గృహంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌యూఏ) ప్రతినిధులు, పి.డబ్ల్యూసి నిపుణులు, అధికారులతో కలిసి మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్‌యూఐ కన్సల్టెంట్ రాహుల్, సీఎంహెచ్‌ఓ రాజిరెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మేయర్ గుండు సుధారాణి
సెప్టిక్ ట్యాంక్ వర్కర్ల
అవగాహన సదస్సు


