భద్రకాళి బండ్ పనులు పూర్తి చేయండి
వరంగల్ అర్బన్: స్మార్ట్‌సిటీ కల్వర్టు పనులు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా పరిధి పద్మాక్షి రోడ్డు శాయంపేట ప్రాంతంలో చేపట్టిన కల్వర్టు పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా చేపట్టిన ఈ పనులు 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. 39, 40 డివిజన్లలో తడి, పొడి చెత్త సేకరణపై తనిఖీ చేసి, స్థానికులను వివరాలు అడిగారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, డీఈలు రాజ్‌కుమార్, రాగి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పనులు పూర్తి చేయండి: మేయర్ సుధారాణి
భద్రకాళి బండ్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం భద్రకాళి బండ్‌పై తుది దశకు చేరుకున్న పనులను కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సత్యనారాయణ ఈఈలు రవికుమార్, మాధవీలత, ఏఈ సంతోశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చెత్త తరలింపులో జాప్యం వద్దు..
సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నుంచి చెత్త తరలింపులో జాప్యం లేకుండా చూడాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం పోతననగర్‌లోని సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను మేయర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్ శానిటరీ సూపర్‌వైజర్ శ్రీను ఉన్నారు.
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
మేయర్‌తో గుండు సుధారాణితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన


