ఎన్నికలకు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎన్నికల జిల్లా పరిశీలకులు శివకుమార్ నాయుడు
హన్మకొండ అర్బన్: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని గ్రామ పంచాయతీ ఎన్నికల హనుమకొండ జిల్లా సాధారణ పరిశీలకులు శివకుమార్ నాయుడు అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసిన అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి అయన అధికారుతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల పరిశీ లకులు శివకుమార్ నాయుడు మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ రోజున ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని, కౌంటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈనెల 11న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజున ఈ మూడు మండలాలకు సెలవు దినంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నాకా బందీలో 173 వాహనాలు సీజ్
వరంగల్ క్రైం : జీపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా 57 ముఖ్యమైన ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 6 నుంచి 9గంటల వరకు నిర్వహించిన నాకా బందీ తనిఖీల్లో ఎలాంటి ప్రతాలు లేని 173 వాహనాలు సీజ్ చేసినట్లు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. అలాగే, ఈ తనిఖీల్లో అక్రమ మద్యం సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసి రూ.1.18 లక్షల మద్యంతోపాటు మూడు లీటర్ల గుడుంబా, రూ.1.50 లక్షల నగదు, అనుమతులు లేకుండా వాహనంలో రవాణా చేస్తున్న రూ. 49వేల విలువైన బాణాసంచా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఐదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు వివరించారు. భట్టుపల్లిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మిస్సింగ్ కేసులో కనిపించకుండా పోయిన ఓ వ్యక్తిని గుర్తించినట్లు సీపీ వెల్లడించారు.
ఎన్నికలకు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు


