సృజనాత్మకత పెంచేందుకు ‘నోబెల్ ప్రైజ్ డే’
● కేయూ రిజిస్ట్రార్
ఆచార్య రామచంద్రం
కేయూ క్యాంపస్: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించేందుకు నోబెల్ ప్రైజ్‌డే ఉత్సవాలు దోహదం చేస్తాయని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మైక్రోబయాలజీ విభాగంలో యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి డాక్టర్ సుజాతలో కలిసి రిజిస్ట్రార్ వి.రామచంద్రం, నోబెల్ ప్రైజ్‌డే ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు డాక్టర్ బి.వెంకటగోపీనాఽథ్, సంగీత, చంద్రశేఖర్, రంగారెడ్డి, ప్రియాంక, కవిత, మహేందర్, రాజేందర్, సాధు రాజేశ్ పాల్గొన్నారు.
విద్యార్థుల పోస్టర్ ప్రజంటేషన్..
లైఫ్ సైన్సెస్ విభాగాలకు చెందిన బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో 212 మంది విద్యార్థులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో 123 మంది విద్యార్థులు పోస్టర్ ప్రజంటేషన్ పోటీల్లో పాల్గొన్నారు. ఆయా విభాగాల అధిపతులు ప్రొఫెసర్ కృష్ణవేణి, శాస్త్రి, సుజాత, మధుకర్, లక్ష్మారెడ్డి, పొఫెసర్ వై.వెంకయ్య, ప్రొఫెసర్ సురేశ్‌లాల్, డాక్టర్ మేఘనారావు పాల్గొన్నారు. ఈనెల 10న పోస్టర్ ప్రజంటేషన్, వక్తృత్వపోటీల విజేతలకు సెనేట్‌హాల్‌లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ఆచార్య మామిడాల ఇస్తారి తెలిపారు.


