పార్లమెంట్ ముట్టడికి తరలిరావాలి
నయీంనగర్: జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించాలని బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు. హనుమకొండలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 15, 16 తేదీల్లో చేపట్టనున్న పార్లమెంట్ ముట్టడి వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వేణుగోపాల్‌గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ ముట్టడికి బీసీలందరూ వేలాదిగా తరలిరావాలని, 16న జరిగే అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు దొడ్డపల్లి రఘుపతి, చిర్ర రాజు, శోభారాణి, సుగుణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కాకినాడలోని జేఎన్టీయూలో ఈనెల 10 నుంచి 14 వరకు నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్‌టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య మంగళవారం తెలిపారు. జట్టులో ఆర్.వెంకటేశ్వర్‌రావు, కె.ఉదయ్‌కిరణ్, జె.సాయికిరణ్, బి.శివకుమా ర్, సి.వసంత్‌రావు, ఎ.సంజీవ్‌కుమార్, టి.రాంచరణ్ అంజి, భీంరావు, కె.సాయికుమార్, పి.ఆదినారాయణ, పి.ప్రమోద్, బి.రోషన్, టి.జస్వంత్, ఎం.లక్ష్మణస్వామి ఉన్నారని పేర్కొన్నారు. బొల్లికుంటలోని వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రామాంజనేయులు జట్టుకు కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు.
ఎంజీఎం: కాళోజీ హెల్త్ వర్సిటీ ప్రాంగణంలోని పార్కింగ్ ప్రదేశంలో మంగళవారం ఉదయం కొండచిలువ కలకలం సృష్టించింది. ఉదయం 10 గంటల సమయంలో కార్యాలయ సిబ్బంది వాహనాలు పార్కింగ్ చేస్తున్న సమయంలో కొండచిలువ కనిపించింది. దానిని పట్టుకునేందుకు సిబ్బంది యత్నించారు. కానీ, నిర్మాణంలో ఉన్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలోకి కొండచిలువ వెళ్లిపోయినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.
కాళోజీ సెంటర్: కరీమాబాద్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోగు అశోక్ 14వ జాతీయస్థాయి సదస్సుకు ఎంపికయ్యారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం జాతీయ స్థాయిలో విద్యాసదస్సు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ‘ఎన్‌హ్యాన్సింగ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఇన్ సెకండరీ స్కూల్ స్టూడెంట్స్’ అనే అంశంపై ఉపాధ్యాయుడు అశోక్ సమర్పించిన పరిశోధన పత్రం జాతీయ సదస్సుకు ఎంపికై ంది. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు రాజస్తాన్ అజ్మీర్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో జరగనున్న జాతీయ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. జాతీయస్థాయి సదస్సుకు ఎంపికై న అశోక్‌ను ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రమేశ్, ప్రొఫెసర్ సురేష్, డీఈఓ రంగయ్యనాయుడు, సుజన్‌తేజ, ఉపాధ్యాయులు అభినందించారు.
పార్లమెంట్ ముట్టడికి తరలిరావాలి


