రేవంత్ పాలనలో అంతా విధ్వంసమే
హన్మకొండ: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అంతా విధ్వంసమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. విజయ్ దివస్‌ను పురస్కరించుకుని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ చేసిన గొప్పపని వేయి ఇళ్లు కూల్చడమేనని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి పైశాచికత్వం నుంచి పుట్టుకొచ్చింది నేటి తెలంగాణ తల్లి అని అన్నారు. కేసీఆర్ ఉద్యమాన్ని అవమానిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఒక్కసారి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాసిన పుస్తకం చదవాలని హితవు పలికారు. మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ దుర్మార్గపు పాలన నుంచి బయటపడేందుకు ప్రజలు కార్యోణ్ముకులు కావాలని పిలుపునిచ్చారు. నాయకులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, పులి రజనీకాంత్, బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, ఇమ్మడి లోహిత, నయీముద్దీన్, సోదా కిరణ్, లక్ష్మీనారాయణ, జానకి రాములు, వెంకన్న రమేశ్ పాల్గొన్నారు.
విజయ్ దివస్‌లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్


