దివ్యాంగులకు ప్రత్యేక హక్కులు
రామన్నపేట: దివ్యాంగులకు అందరితో సమానమైన హక్కులతోపాటు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని లూయిస్ ఆదర్శ బ్‌లైండ్ స్కూల్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకులకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎలాంటి వైకల్యం కలిగి ఉన్న వారికై నా ఉన్నత చదువుల్లో 5 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4 శాతం, ప్రభుత్వేతర ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదిని సమకూర్చి వారి కేసులు వాదించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపీ పేపర్లను, బిస్కెట్లను అందించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి సాయికుమార్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, కల్యాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలా గీతాంబ


