గర్భిణులకు జాగ్రత్తలు వివరించాలి
హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య
ఎంజీఎం: వ్యాధినిరోధక టీకాల కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు టీకాలు ఇప్పించడంతోపాటు వారు తీసుకోవాల్సిన పోషకాహారం, పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని హనుమకొండ జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ అప్పయ్య వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం ఆయన నగరంలోని లష్కర్‌సింగారం పీహెచ్‌సీ పరిఽధిలోని గాంధీనగర్ అంగన్‌వాడీ కేంద్రం, గోపాలపూర్ వార్డు ఆఫీస్, గణేశ్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కోసం ఉన్న లిస్టు, అందుల్లో ఎంత మందికి వ్యాక్సిన్ వాశారు, సమాచారం అందించేందుకు ఫోన్ మెసేజెస్, ఏఈఎఫ్‌ఐ కిట్లు, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ చేస్తున్నారా అనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణిగా నమోదైనప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు వివరించడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం జరిగేలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది తమకు కొత్త హబ్ కట్టర్లు, వ్యర్థాల నియంత్రణకు రెడ్, బ్లాక్ బ్యాగులను అందజేయాలని డీఎంహెచ్‌ఓను కోరారు. త్వరలోనే అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
గోపాల్‌పూర్‌లో ప్రైవేట్ క్లినిక్ తనిఖీ
గోపాల్‌పూర్‌లోని మహీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్‌ను స్థానిక వైద్యాధికారి హైదర్‌తో కలిసి డీఎంహెచ్‌ఓ అప్పయ్య తనిఖీ చేశారు. ఆస్పత్రి అనుమతి పత్రాలను పరిశీలించారు. అలాగే, కంట్రోల్ అథారిటీ జారీ చేసిన ఆదేశాల మేరకు మెడికల్ షాపుల్లో ఎంటీపీ కిట్లను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదని, వివరాలను రిజిస్టర్‌లో తప్పక నమోదు చేయాలని ఆదేశించారు.


