రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ పుట్ ఓవర్ బ్రిడ్జి మంజూ
కాజీపేట రూరల్: కాజీపేట ఎలక్ట్రిక్ లోకో షెడ్డు వద్ద కార్మికుల సౌకర్యార్థం రైల్వే అధికారులు పుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేశారు. 2004లో నిర్మించిన ఎలక్ట్రిక్ లోకో షెడ్డుకు వెళ్లి వచ్చే కార్మికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. రైళ్ల రాకపోకలు ఉన్న సమయంలో గేట్ వద్ద కార్మికులు వేచి చూడాల్సి వస్తోంది. దీంతో విధులకు ఆలస్యమవుతోంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని అనేక సార్లు రైల్వే నాయకులు, కార్మికులు సికింద్రాబాద్ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చా రు. ఈమేరకు మంగళవారం సికింద్రాబాద్‌లో జరి గిన సికింద్రాబాద్ డివిజన్, జోనల్ స్థాయి పీఎన్‌ఎం మీటింగ్‌లో కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రస్తావించగా.. రైల్వే జీఎం మంజూరు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరుతో రైల్వే కార్మికులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


