పెన్షనర్లను భారంగా చూస్తున్న ప్రభుత్వాలు
● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య
హన్మకొండ: పెన్షనర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భా రంగా భావిస్తూ తమ కర్తవ్యం నుంచి వైదొలగాలని చూస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా 7వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎల్.అరుణ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తూపురాణి సీతారాం, ప్రధాన కార్యదర్శిగా నారాయణగిరి వీరన్న, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా బేతి శంకర లింగం, ఆర్థిక కార్యదర్శిగా సిద్ధి రాజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు సముద్రాల రాంనర్సింహాచారి, డిప్యూటీ డైరెక్టర్ అండ్ జిల్లా కోశాధికారి ఆకవరం శ్రీనివాస్ కుమార్, ప్రముఖ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు కంచర్ల సుధీర్, శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్స్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి.శరత్ బాబు, నాయకులు ప్రభాకర్ రెడ్డి, పరికిపండ్ల వేణు, సంపత్ కుమార్, శంకర్ రావు, రహమాన్, ఎం.దామోదర్, తది తరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎఫ్ ఆర్టీఏ చట్టాన్ని, వాలిడేషన్ ఆఫ్ పెన్షనర్స్ యాక్ట్, సీపీఎస్‌ను రద్దుచేయడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.


