బీసీ రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలి
హన్మకొండ: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నుంచి బీసీ రిజర్వేషన్లపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బీసీ ప్రధాని అని నరేంద్ర మోదీ చెప్పుకోవడం మినహా బీసీలకు ఆయన చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు హామీ ఇచ్చిందని, బీసీల ఓట్లతో అధికారంలోకొచ్చి అమలు చేయకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి ఎంపీలతో పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని, అప్పుడే బీసీ లకు న్యాయం జరుగుతుందన్నారు. బీ సీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయని, బీసీలకు కాంగ్రెస్ మొదటి శత్రువైతే.. బీ జేపీ రెండో శత్రువన్నారు. చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 9న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామన్నారు. ఉ మ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా తరలొచ్చి పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలన్నారు. అనంతరం చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవి కృష్ణ గౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, నాయకులు సంగని మల్లీశ్వర్, బొనగాని యాదగిరి గౌడ్, పల్లపు సమ్మయ్య, దొడ్డిపల్లి రఘుపతి, తమ్మల శోభారాణి, తేళ్ల సుగుణ, పద్మజ, చిర్ర రాజు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్


