రక్తదానం మానవత్వానికి ప్రతీక
వరంగల్ లీగల్: రక్తదానం సేవా కార్యక్రమం మాత్రమే కాదని, అది మానవత్వానికి ప్రతీక అని వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు నిర్మలా గీతాంబ, పట్టాభిరామారావు అన్నారు. వరంగల్ డీఎల్‌ఎస్‌ఏ, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మంగళవారం జిల్లా కోర్టులోని డీఎల్‌ఎస్‌ఏ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని న్యాయమూర్తులు ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, సంయుక్త కార్యదర్శి శ్రీధర్, మహిళా సంయుక్త కార్యదర్శి శశిరేఖ, కోశాధికారి సిరిమల్ల అరుణ, కార్యవర్గ సభ్యులు సురేశ్, కళకోట్ల నిర్మల జ్యోతి, రాజు, రవి, అరుణ, ఇతర న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


