అనర్థం.. ఈ–వ్యర్థం!
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరంగల్ అర్బన్: ఓరుగల్లు నగరాన్ని ఈ–భూతం వెంటాడుతోంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు నగర ప్రజానీకానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. హైదరాబాద్ తర్వాత అంతగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో ఐటీ కంపెనీలు క్రమేపీ విస్తరిస్తున్నాయి. హార్డ్‌వేర్ ఆధారిత పరిశ్రమలు, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, స్మార్ట్ ఫోన్లు, ప్రింటర్లు, టెలిఫోన్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీలు, కూలర్లు వంటివి ఉత్పత్తి జరుగుతోంది.
పెరిగిపోతున్న వినియోగం, వేస్టేజ్
సౌకర్యవంతమైన జీవనం కోసం కొందరు విచ్చలవిడిగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉపకరణాలు వినియోగిస్తున్నారు. మరికొందరు విలాసాలకోసం ఎలక్ట్రానిక్స్ వస్తువులు వాడుతున్నారు. ఇలా.. రోజురోజుకూ వినియోగం పెరుగుతోంది. అదే స్థాయిలో ఈ–వేస్టేజ్ పెరిగిపోతోంది. ఒక్కో ఇంటి నుంచి ఏటా 5 కిలోల ఈ–వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత, పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. వీటి కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. నగరంలో ఏటా సగటున్న 3,650 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పొగుపడుతుండగా, వీటిలో 75 శాతం గృహాల నుంచి వెలువడుతుంటం గమనార్హం. ఇక పరిశ్రమలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, శిక్షణ కేంద్రాల నుంచి వెలువడే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరల్లేదు. నగరంలో వెలువడుతున్న ఈ–వ్యర్థాలపై అవగాహన కల్పించడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది.
రీసైక్లింగ్ చేయాలి..
తడి, పొడి చెత్తను వేరుచేస్తున్న క్రమంలో ఈ–వేస్ట్‌ను వేరు గృహ యజమానులు వేరు చేసి, స్వచ్ఛ ఆటో సిబ్బందికి అందజేయాలి. అందుకోసం బల్దియా అధికార యంత్రాంగం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సేకరించిన వేస్ట్‌ను బల్దియా రీసైక్లింగ్ ప్రాసెస్‌ను ప్రారంభించాలి. ప్రజల్లో ఈ వ్యర్థాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ఈభూతం నుంచి ప్రజల్లో మేల్కోలుపు కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
పర్యావరణానికి
పొంచి ఉన్న ముప్పు
ఏడాదికి 360 మెట్రిక్ టన్నులు
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
క్యాథోడ్ రేటూబ్య్‌లు: టీవీల్లో వినియోగించే ఈ ట్యూబుల్లో లెడ్, బేరియం, ఇతర భార లోహాలు, నీటిని విషంగా మార్చే సల్పర్ భూగర్భ జలాల్లో చేరుతాయి. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులను వృథాగా పడేయడంపై బ్రోమిన్, ఈ–చిప్స్, బ్రోమిన్, కాడ్మియం, మోర్యూరీ, ఇతర భార లోహాలు, భూగర్భ జల్లాల్లో చేరుతున్నాయి. ఇనుము, జింక్, నికెల్, పెల్లాడియం తదితర లోహాలు వినియోగించడం వల్ల సహవనరులపై ఒత్తిడి పెరుగుతోంది. నైట్రోజన్ ఆకై ్సడ్, లెడ్, అర్సినిక్, కాడ్మియం ఆమ్ల వర్షాలకు కారణమవుతున్నాయి. కంప్యూటర్ విడి భాగాలు, రబ్బరు, ప్లాసిక్ వస్తువులు, పాలీ ఆరో మాటిక్ హైడ్రో కార్బన్లు వెలువడే పీల్చే గాలి విషతుల్యమవుతోంది. సెమీ కండకర్లు రసాయనాలు, మూలకాలు, శ్వాస క్రియ, రక్త ప్రసరణ వ్యవస్థ, కాలేయం, వినాళ గ్రంథులు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. ఎల్‌సీడీలు మో ర్క్యూరీ మెదడు, రక్త నాళాలు దెబ్బతింటున్నాయి. ప్రత్యుత్పుత్తి వ్యవస్థ ఊపిరితి త్తులు, మూత్రపిండాలు దెబ్బతింటాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనర్థం.. ఈ–వ్యర్థం!


