డంప్ యార్డు శాశ్వత పరిష్కారానికి బయోమైనింగ్
బస్తీ మే సవాల్!
ఈ అడ్డా మాదే ఎవరొస్తారో రండి అన్నట్లుగా నడిరోడ్డుపై గుంపులుగా తిరుగుతున్నాయి కుక్కలు. హనుమకొండలోని కుమార్‌పల్లి మార్కెట్ వద్ద మంగళవారం గుమిగూడిన శునకాల్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – హన్మకొండ చౌరస్తా
కాజీపేట అర్బన్: గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ పరిధి రాంపూర్‌లోని డంపింగ్ యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి బయోమైనింగ్ లెగెస్సీ వేస్ట్ ప్రాసెసింగ్ వర్క్ తోడ్పడుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. రాంపూర్‌లోని డంపింగ్ యార్డులో బయోమైనింగ్ ప్రాజెక్టును మంగళవారం మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని, తాను సైతం మడికొండ డంపింగ్ యార్డు సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. వరంగల్‌లోని చెరువులు, నాళాల అక్రమణల నివారణకు హైడ్రా మాదిరిగా వాడ్రా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్.దిలీప్‌రాజ్, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రఘుచందర్, పార్టీ మండల అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వస్కుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
డంప్ యార్డు శాశ్వత పరిష్కారానికి బయోమైనింగ్


